యాప్ ల బ్యాన్ పై చైనా ఫైర్

-

43 చైనా మొబైల్ యాప్స్ ని కేంద్రం బ్లాక్ చేసిన ఒక రోజు తర్వాత చైనా స్పందించింది. భారతదేశం “జాతీయ భద్రతను ఒక సాకుగా ఉపయోగించుకోవడాన్ని” చైనా వ్యతిరేకిస్తున్నట్లు భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. మీడియా అడిగిన ప్రశ్నకు గానూ ఈ సమాధానం ఇచ్చింది. పదే పదే ఇలాంటి మాటలను ఉపయోగించి యాప్స్ ని బ్యాన్ చేస్తున్నారు అని చైనా మండిపడింది.

“చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ విదేశీ చైనా కంపెనీలకు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది అని చెప్పింది. చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా పని చేస్తుంది అని పేర్కొంది. మంగళవారం, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ యొక్క ఇ-కామర్స్ యాప్ అలీఎక్స్‌ప్రెస్‌ తో సహా మరో 43 చైనా మొబైల్ యాప్‌ లను భారత్ బ్లాక్ చేసింది. కొన్ని డేటింగ్ యాప్ లను కూడా బాన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news