ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్న డ్రాగన్ దేశం…అసలు ఏమి జరిగింది!

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మందికి సోకగా,37 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ వల్ల ఇప్పుడు అమెరికా,స్పెయిన్,ఇటలీ లు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. అయితే పుట్టిన దేశం ఆయిన చైనా లో మాత్రం ఆ సిటీ దాటి ఇతర రాష్ట్రాల్లో గాని,ప్రాంతాలలో కానీ కరోనా కేసులు పెద్దగా నమోదు కాకపోవడం తో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా అనేది చైనా వదిలిన జీవాయుధం అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. మరోపక్క ఆ దేశంలో మృతి చెందిన వారి సంఖ్య విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చింది అంటూ ‘డైలీ మెయిల్’ ఒక కధనం కూడా ప్రచురించింది. అయితే ఈ కరోనా విషయం ఏమోగానీ ఈ వైరస్ గురించి మొదటిసారిగా నోరువిప్పిన డాక్టర్ ఆ తరువాత కరోనా తో మృతి చెందడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైరస్ గురించి నోరువిప్పిన డాక్టర్ లీ వెన్ లింగ్ పై చైనా ప్రభుత్వం కఠిన చర్యలే తీసుకుంది. కరోనా గురించి బయటకు చెప్పడం తో అతనిని జైల్లో కూడా పెట్టింది. ఆ తరువాత అతడు కరోనా వైరస్ సోకి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ విషయాన్ని చైనా బయటకి కూడా చెప్పలేదు.

అయితే చైనా పాల్పడిన మరో దురాగతం తాజాగా వెలుగులోకి వచ్చింది. వూహాన్ సెంట్రల్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తున్న మహిళా వైద్యురాలు అయిన ఫెన్ కనిపించకుండా పోయారు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ గురించి అంతర్జాతీయ న్యూస్ చానల్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ ఇచ్చిందనే కారణం చూపించి చైనా ప్రభుత్వం ఆమెని ఉద్యోగంలోంచి తొలగించినట్లు తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఆమె జాడ అనేది తెలియక పోవడం తో అసలు చైనా లో రహస్యం దాగి ఉందని,కరోనా విషయంలో ప్రపంచానికి తెలియకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది అంటూ ప్రపంచ దేశాలు నమ్మే పరిస్థితి ఏర్పడింది.