ఈఎంఐల విషయంలో భయపడుతున్న ఖాతాదారులకు  బంగారం లాంటి వార్త చెప్పిన ఎస్బిఐ..!!

-

ఎస్బిఐ బ్యాంకు లో మీకు అకౌంట్ ఉందా ? ఏదైనా లోన్ తీసుకున్నారా ? ప్రతినెల ఈఎంఐ చెల్లిస్తున్నారా? అయితే ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఎస్బిఐ ఖాతాదారులకు బంగారం లాంటి వార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసినదే. దీంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పేదవాడు నుండి ఐశ్వర్యవంతులు వరకు ఎవరు ఇల్లు దాటి బయటికి రావటం లేదు. జీతాలు లేవు మరియు చేయడానికి ఉద్యోగాలు లేవు. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆర్బిఐ తో చర్చలు జరిపి ఈఎంఐల విషయంలో భయపడుతున్న వారికి భరోసా ఇవ్వడం జరిగింది. మూడు నెలలపాటు అన్ని రకాల లోన్ల ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విధించింది ఆర్‌బీఐ.SBI announces 'residential builder finance with buyer guarantee ...అన్ని రకాల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో కొన్ని బ్యాంకులు అభ్యంతరం తెలపగా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం తమ కస్టమర్లకు ఆర్బిఐ అమలులోకి తెచ్చిన అన్ని రకాల లోన్ల ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం  స్వాగతించింది. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఎస్బిఐ పలు విషయాలను వెల్లడించింది. 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, వడ్డీని వాయిదా వేసేందుకు చర్యలు తీసుకున్నామని ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది.

 

రీపేమెంట్ పీరియడ్‌ను మూడు నెలలు పొడిగించినట్టు చెప్పింది. ఎస్‌బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదు. వారి క్రెడిట్ స్కోర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో లాక్ డౌన్ వల్ల ఈఎంఐ విషయంలో భయపడుతున్న ఎస్‌బీఐ ఖాతాదారులకు ఇది బంగారం లాంటి ఊరట నిచ్చే వార్త అని చెప్పవచ్చు.  

Read more RELATED
Recommended to you

Latest news