మూడో సారి అధ్యక్షుడిగా జిన్ పింగ్… చైనాకు శాశ్వత అధ్యక్షుడిగా ఉండే ప్లాన్..!

-

చైనా దేశానికి మూడో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు జిన్ పింగ్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) పావులు కదుపుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తీర్మాణం చేసే ఆలోచనలో ఉంది. తాజాగా చైనాలో 19వ సెంట్రల్‌ కమిటీ ఆరో ప్లీనరీ సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమయ్యింది. ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా జిన్ పింగ్ అధికారం చేపట్టారు. ఇదిలా ఉంటే మూడో సారే కాకుండా శాశ్వతంగా అధ్యక్షుడిగా జిన్ పింగే ఉండేాలా పావులు కదుపుతున్నారు. వచ్చే ఏడాది జిన్ పింగ్ పదవీకాలం ముగియనుంది.

శక్తివంతమైన నేతగా జిన్ పింగ్

ప్రస్తుతం చైానాలో శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ ఉన్నారు. ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) అధ్యక్షుడిగానే కాకుండా శక్తివంతమైన సెంట్రల్ మిలిటరీ కమీషన్( సీఎంసీ) చైర్మన్గా.. చైనా అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పటికే జిన్ పింగ్  అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు అవుతోంది. రెండో సారి అధ్యక్షుడిగా వచ్చే ఏడాది ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈలోపే మూడో సారి అధ్యక్ష పదవిని చేపట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. గతంలో రెండు సార్ల కన్నా ఎక్కువగా పదవీ బాధ్యతలు చేపట్టేలా చైనా రాజ్యాంగంలో కూడా మార్పులు చేశారు. దీంతో అధ్యక్ష పదవి శాశ్వతంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గత చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ తర్వాత శక్తివంతమైన నేతగా జిన్ పింగ్ మారారు. జిన్‌పింగ్‌కు 2016లో కమ్యూనిస్టు పార్టీలో ‘అత్యంత కీలకమైన నాయకుడు’ అన్న హోదా లభించింది. జిన్ పింగ్ హయాంలోనే చైనా ప్రపంచ శక్తిగా మారుతుందని చైనా కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తోంది. అమెరికా పెద్దన్న స్థానాన్ని కైవసం చేసుకునేలా చైనా తహతహలాడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news