తమిళనాడుకు క్యూ కట్టిన పొలిటికల్ లీడర్స్..

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు జాతీయ నాయకులు అందరూ తమిళనాడు క్యూ కట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే తమిళనాడుకి సంబంధించి అతి పెద్ద పండుగ కావడంతో రాజకీయ నాయకులు అందరూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూలకాడై దగ్గర సంక్రాంతి వేడుకల్లో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భవగత్ పాల్గొననున్నారు. మధుర వోయాల్ లో జరిగే సంక్రాంతి సంబరాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.

ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మదురై జిల్లాలో జరుగుతున్న “జల్లికట్టు” కార్యక్రమానికి హాజరవుతారు. ఎద్దులను అదుపు చేసి ఆడే ఈ జల్లికట్టు తమిళనాడుకు ఒక సంప్రదాయ క్రీడగా వస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, సుప్రీంకోర్టు జంతువులపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ ఈ పద్ధతిని నిషేధించింది. అయితే తమిళనాడు వాసుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తరువాత చట్టబద్ధం చేసింది.