గబ్బిలాలపై చైనా కీలక నిర్ణయం…!

-

కరోనా వైరస్ ఏ విధంగా పుట్టింది…? ఇప్పుడు దీనిపై అనేక చర్చలు, అనేక అనుమానాలు… అది ఎవరికి ఇప్పుడు అంతుబట్టడం లేదు. దీనికి మందు కూడా కనిపెట్టలేక అవస్థలు పడుతున్నాయి ప్రపంచ దేశాలు అన్నీ కూడా. కరోనా పుట్టింది గబ్బిలాల నుంచి త్రాచు పాముల నుంచి అంటూ ఎవరికి వారుగా మాట్లాడుతున్నారు గాని అది ఎలా పుట్టిందో కూడా ఎవరూ ఇప్పటి వరకు ప్రపంచానికి చెప్పడం లేదు.

వైరస్ పుట్టిన చైనాలో కూడా దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఈ వైరస్ ని సృష్టించారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ వైరస్ ని సృష్టించడం తోనే దీనిపై చైనా ఏమీ మాట్లాడటం లేదని, ఊహాన్ లో సముద్ర తీరం వద్ద దీన్ని పగలకోట్టారని అంటున్నారు. గబ్బిలాల నుంచి సోకింది అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇదే విషయం చెప్తుంది. వాటిని వాళ్ళు తిన్నారని అంటున్నారు.

వాళ్ళు తినడం వలనే కరోనా వచ్చింది అని గట్టిగా చెప్తుంది ప్రపంచం… ఈ నేపథ్యంలో షెన్‌జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములు తినడాన్ని నిషేధించారు. గబ్బిలాల మీద కూడా చైనా నిషేధం విధించింది. పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలు తినేందుకు ఓకే చెప్పింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news