వూహాన్‌లో పార్టీల‌తో ప్ర‌జ‌లు ఎంజాయ్‌.. మ‌రోసారి అనుమానాస్ప‌దంగా చైనా వ్య‌వ‌హార శైలి..!

-

క‌రోనా వైర‌స్ కేసులు మొద‌ట‌గా న‌మోదు అయిన మ‌ధ్య చైనా ప్రాంతంలోని వూహాన్‌లో వేల మంది ఒకే చోట చేరి పార్టీలు చేసుకున్నారు. ఓ వాట‌ర్ పార్కులో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున చేరి సంద‌డిగా గ‌డిపారు. చూస్తే ఒక్క‌రు కూడా మాస్కులు ధ‌రించ‌లేదు. క‌రోనా వ్యాప్తి లేన‌ప్ప‌టికీ అక్క‌డ ప్ర‌జ‌లు అలా ఎలా పార్టీలు చేసుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు. దీంతో చైనా వ్య‌వ‌హార‌శైలిపై మ‌రోసారి అనుమానాలు క‌లుగుతున్నాయి.

chinese people enjoy at wuhan water park

వూహాన్‌లోని మాయా బీచ్ వాట‌ర్ పార్కులో వేల మంది తాజాగా జ‌రిగిన వీకెండ్ సంద‌ర్భంగా పార్టీలు చేసుకున్నారు. స్విమ్ సూట్లు వేసుకుని మ్యూజిక్ ఫెస్టివ్‌లో పాల్గొన్నారు. అక్క‌డ 76 రోజుల లాక్ డౌన్ అనంత‌రం జూన్‌లో కార్య‌క‌లాపాలు తిరిగి మొద‌ల‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లంద‌రూ అలా వేల మంది ఒక చోట చేరి.. అందులోనూ వాట‌ర్ పార్కులో మాస్కులు లేకుండా.. భౌతిక దూరం పాటించ‌కుండా పార్టీలు ఎలా చేసుకున్నార‌నేది అనుమానాల‌కు తావిస్తోంది.

నిజానికి కరోనా వైర‌స్ ప‌ట్ల మొద‌ట్నుంచీ చైనా అనుమానాస్ప‌దంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. వూహాన్‌లోనే క‌రోనా వైర‌స్ పుట్టినా.. కాద‌ని వాదించింది. ఓ వైపు ప్ర‌పంచ దేశాల్లో రోజు రోజుకీ క‌రోనా కేసులు పెరిగిపోతుంటే.. అక్క‌డ మాత్రం ఒక్క‌సారిగా క‌ట్ చేసిన‌ట్లు ఆ కేసుల న‌మోదు తగ్గిపోయింది. ఇక తాజాగా ఇప్పుడు ప్ర‌జ‌లు విచ్చ‌ల‌విడిగా పార్టీలు చేసుకుంటున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే చైనా వ్య‌వ‌హార శైలి అనుమానాస్ప‌దంగా ఉంద‌ని ఎవ‌రికైనా ఇట్టే సందేహం క‌లుగుతుంది. దీనిపై ప్ర‌పంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news