వైసీపీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌…

-

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక్షేమం పేరిట ప్ర‌జ‌ల ఖాతాల్లోకి ఎంత మొత్తం వేస్తున్నా కొంద‌రు మంత్రులు.. మెజార్టీ ఎమ్మెల్యేల చ‌ర్య‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి బ్యాడ్ నేమ్ వ‌స్తుంద‌న్న టాక్ వ‌స్తోంది. ఏపీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఇప్ప‌టికే యేడాదిన్న‌ర అవుతోంది. ఇటీవ‌ల మార్పులు, చేర్పుల్లో జ‌గ‌న్ ఇద్ద‌రు కొత్త మంత్రుల‌కు త‌న కేబినెట్లో చోటు క‌ల్పించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యేల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నా వారిలో కొంద‌రు మాత్రం చేయి త‌డ‌పందే ప‌ని కావ‌డం లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వైసీపీ ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ?  ఉంద‌న్న దానిపై చెన్నైకు చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీతో స‌ర్వే చేయించింద‌ట‌. ఈ స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాలు చూస్తే దారుణంగా ఉన్నాయ‌ని వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చాలా మంది కొత్త వాళ్ల‌తో పాటు టీడీపీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు సీట్లు ఇవ్వ‌గా… వారు కూడా ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. ఈ కొత్త నేత‌ల్లో చాలా మందికి నియోజ‌క‌వ‌ర్గంలో చాలా మందికి కేడ‌ర్ మీద‌.. అధికారుల మీద ఎంత మాత్రం ప‌ట్టులేద‌ట‌. మ‌రి కొంద‌రు తాము ఎమ్మెల్యే అయిపోయాం ఇక చాలు.. అంతా తాము చెప్పిన‌ట్టు జ‌ర‌గాలి.. త‌మ వాటా త‌మ‌కు ఇచ్చేస్తే చాలు అన్న‌ట్టుగా వ‌సూళ్లు మొద‌లు పెట్టేశార‌ట‌. మ‌రి కొంద‌రు యువ‌కులు.. రాజ‌కీయ అనుభ‌వం లేని వాళ్లు.. ఆర్థికంగా స్థితిమంతులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావ‌డంతో వీరికి ప్ర‌జ‌ల ఇబ్బందులు… నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప‌ట్ట‌డం లేద‌ట‌.

కేవ‌లం ఎమ్మెల్యే స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న వారు కొంద‌రు అయితే.. మ‌రి కొంద‌రు త‌మ‌కంటూ ఓ కోట‌రీని ఏర్పాటు చేసుకుని వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూ.. డ‌బ్బు ముట్ట‌చెప్పిన వారికే ప‌నులు చేస్తున్నార‌ని తేలింద‌ట‌. ఇలాంటి ఎమ్మెల్యేల చ‌ర్య‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదు ప‌దేళ్లుగా ప‌ని చేస్తోన్న నాయ‌కులు వెనక్కు వెళ్లిపోతోన్న ప‌రిస్థితి ఉంది. కొంద‌రు మంత్రులు సైతం క్యాష్ ఇస్తే ట‌క‌ట‌కా ప‌నులు చేస్తున్నార‌ని కూడా తేలింద‌ట‌. వీరి వ‌ల్ల ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో డ్యామేజ్ అయ్యిందంటున్నారు. ఈ సర్వే ఒక సీనియర్ మంత్రి ఒక ఎంపీ ఇద్దరు కలిసి చేపించారని పార్టీ వర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నివేదిక జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డంతో ఈ ఎమ్మెల్యేల్లో కొంద‌రికి జ‌గ‌న్ వార్నింగ్ కూడా ఇచ్చార‌ని టాక్‌…?

Read more RELATED
Recommended to you

Latest news