ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిరంజీవి మరియు విజయ్ దేవరకొండ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతమని.. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతమని చిరంజీవి పేర్కొన్నారు. ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు మెగా స్టార్ చిరంజీవి.
తన కుటుంబం బతుకమ్మ ను ఇంట్లో జరుపుకుంటోందని.., తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు అంటూ హిరో విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. “బతుకమ్మ పాటలు మరియు నృత్యాల పండుగను జరుపుకుంటాను…ఈ సాంస్కృతిక వేడుకలను ఉద్వేగభరితంగా ప్రోత్సహిస్తున్న కవిత అక్కకు ప్రత్యేక ప్రశంసలు. ఈ అందమైన స్థానిక పండుగ గురించి మాకు మరియు దేశానికి అవగాహన కల్పించారు” అంటూ ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ తెలిపారు.
Happy Bathukamma 🌼
My family is celebrating it at home, I send my best to women across the state bonding over and celebrating this beautiful festival of flowers, song and dance.https://t.co/3LfTwsHfG6
— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2021
ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 6, 2021