ఉగాది పర్వదినాన విడుదలైన ‘రంగమార్తాండ’ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగంతో బరువైన హృదయాలతో థియేటర్ల నుంచి బయటకు వెళ్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రంగమార్తాండ సినిమా చూసి ఆయనకు అప్రయత్నంగా ఏడుపొచ్చేసింది చెప్పారు.
‘‘రంగమార్తాండ’ చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి చిత్రం ఇది. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్న భావన కలుగుతుంది. ఈ చిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఓ క్రియేటివ్ దర్శకుడు, ప్రకాశ్‌రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, హాస్యబ్రహ్మానందం.. వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇలాంటి ఉద్విగ్నభరితమైన పాత్ర చేయడం ఇదే తొలిసారి. సెకండాఫ్ మొత్తం అప్రయత్నంగానే కన్నీరు వచ్చేసింది. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ.. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Kudos to #Rangamarthanda 👏👏@director_kv @prakashraaj #Brahmanandam @meramyakrishnan pic.twitter.com/spjo5FZlWw
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2023