రామోజీరావు లో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని. మాత్రం చిన్న పిల్లాడిని చూశానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. రామోజీరావుకు పెన్నులు అంటే చాలా ఇష్టమని.. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఆయనకు ఒక పెన్ను బహూకరించినట్టు తెలిపారు. అయితే పెన్నును చూసి మురిసిపోయారు రామోజీరావు.
ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ నాకు చూపించారు. తన ఆలోచనలకు తగినట్లుగా వాటిని వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారు. ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఆయన చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు. రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు.. తెలుగు జాతికి తీరని లోటు. ఒక మహావ్యక్తిని, శక్తిని కోల్పోయామని చిరంజీవి అన్నారు.