నా రాజకీయ వారసుడు అతడు కాదు.. నవీన్ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు

-

ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తన రాజకీయ వారసుడి గురించి మీడియా ముఖంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలంగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ మొన్నటి ఎన్నికల్లో పరాభవం ఎదురవ్వడంతో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ వారసుడి గురించి ఎప్పుడు అడిగినా నేను ఒకటే చెబుతానని, నా రాజకీయ వారసుడు మిస్టర్ పాండియన్ కాదని, దానిని ఒడిశా ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. మిష్టర్ పాండియన్ పై కొన్ని విమర్శలు వచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు.

పాండియన్ గత పది సంవత్సరాలలో రెండు తుఫానులు, కోవిడ్-19 లోను అందరికీ సహాయం చేస్తూ.. అనేక రంగాలలో అద్భుతంగా పని చేశాడని తెలిపారు. పాండియన్ పార్టీలో చేరిన నాటినుంచి ఏ పదవీ అనుభవించలేదని, ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని గుర్తుచేశారు. అలాగే ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తి అని గుర్తుంచుకోవాలన్నారు. ఒడిశా ప్రజలు పదే పదే నన్ను ఆశీర్వాదించారని, వారి ఆశీర్వాదాలతో వారికి సేవ చేసేందుకు నాకు అనుమతి నిచ్చింనందుకు ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. మా ప్రభుత్వం ఎల్లప్పుడు అద్భుతమైన పని చేయడానికి ప్రయత్నించామని, మా ప్రభుత్వం గురించి, పార్టీ గురించి గర్వపడాల్సిన అవసరం ఉందని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news