ఆస్కార్ అవార్డు సెలబ్రేషన్స్: చంద్రబోస్ ను సత్కరించిన చిరంజీవి !

-

తెలుగుతనాన్ని దేశాలు దాటి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళి అండ్ టోటల్ టీం అఫ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దక్కుతుంది. ఈ సినిమాలోని నాటు నాటు అనే పాటకు ప్రపంచం అంత ఎంతో గర్వంగా చెప్పుకునే ఆస్కార్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం. దీనికి కారణమైన రాజమౌళి, కీరవాలి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ , చంద్రబోస్, కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్ , ప్రేమ్ రక్షిత్ ఇలా అందరూ ఎంతో కష్టపడ్డారు కాబట్టి భారతీయ సినిమాకు ఇంతటి గౌరవం దక్కింది.

తాజాగా ఈ పాటను రచించిన చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సెట్ లో సత్కరించి తన ఆనందాన్ని ఆయనతో పంచుకున్నాడు చిరు. సంవతసరాల సుదీర్ఘ ఆస్కార్ చరిత్రలో తెలుగు పదాలను ఆ వేదికపైన వినిపించిన ఘనత నీకే చంద్రబోస్ అంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news