తెలుగు ,తమిళ సినిమాలు చాలా కాలం పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ కు ముంబాయి,కలకత్తాలను ఎంచుకునేవి.ఇప్పటికీ ఎంచుకుంటూనే ఉన్నాయి.ఆ తర్వాత కాలంలో కలకత్తా ట్రాక్ వర్కవుట్ అవ్వడంతో అటువైపుగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి.తమిళంలో ఘటికుడు ,తెలుగులో లక్ష్మీ లాంటి సినిమాలను కలకత్తా బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసి మంచి యాక్షన్ ఫీల్ ను క్యాచ్ చేశారు.
యాక్షన్ ప్యాక్ లకు సౌత్ స్టార్స్ కలకత్తాను బ్యాక్ డ్రాప్ గా ఎంచుకుంటారు.కోలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోను ఈ కల్చర్ ఉంది.ఐతే గత కొంతకాలం ఈ కల్చర్ లవ్ స్టోరీస్ కు మాత్రమే వాడుతున్నారు.తాజాగా చిరు తన యాక్షన్ ప్యాక్ కు మరోసారి కలకత్తాను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది..
తాజాగా మరోసారి కలకత్తా బ్యాక్ డ్రాప్ ను తెలుగు సినిమాకు వాడుకోవాలని చూస్తున్నారు.అలా చూసే సినిమా మరేదో కాదు..వేదాలం రీమేక్ .మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిలిం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెల్లబోతుంది. ఈ సినిమాలో కలకత్తా నేపథ్యానికి ,కథకు మధ్య లింక్ ఉంటుంది. ఆ లొకేషన్ నేపథ్యాన్ని కథలో యాడ్ చేస్తున్నారని తెలుస్తుంది.చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి ఇలాగే కలకత్తా బ్యాక్ డ్రాప్ తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆతర్వాత మళ్లీ ఆ స్తాయిలో చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఇది కూడా కశ్చితంగా తనకు వర్కవుట్ అవుతుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం మెహర్ ఈ చిత్రానికి లొకేషన్స్ వేటలో ఉన్నట్టు తెలుస్తుంది.