పవన్ అభిమానిగా కనిపించనున్న చిరు.. అసలు అభిమానులు ఒప్పుకుంటారా..!

-

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానగా కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి..

Pawan Kalyan on Chiranjeevi Konidela - TOP News

మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ గా వస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్ ను ఇప్పటికే మెగా అభిమానులు అంగీకరించడం లేదు.. కానీ వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయడానికి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంది చిత్ర బృందం. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా బోలా శంకర్ నుంచి ఒక పోస్టర్ విడుదలైంది. అలాగే ఈ సినిమా నుంచి అప్పుడప్పుడు కొన్ని షూటింగ్ సన్నివేశాలు, లీకులు సైతం బయటికి వస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులంతా ఈ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్ కు అభిమానిగా కనిపిస్తున్నారని.. ఖుషి ఐకానిక్ బిట్ నడుము సీన్ ను రీ క్రియేట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది..

అసలు ఇది ఎలా సాధ్యం అంటూ మెగా అభిమానులంతా తెగ హైరానా పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తమ్ముడు కాబట్టి చిరంజీవికి అభిమానిగా నటించిన బాగుంటుంది కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ కు అభిమానిగా నటిస్తే చూడటం కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఇప్పటికీ చిరు అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. అయితే చిరు అమితాబ్ కి అభిమానిగా నటిస్తే ఒప్పుకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ కి అభిమానిగా మాత్రం నటించోద్దని చెబుతున్నారు.. అలాగే ఆ సీన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని కానీ చిరంజీవిని ఏ మాత్రం తక్కువగా చూపించిన మెగా అభిమానులు మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేనట్టు కనిపిస్తుంది.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుందని చెప్పాలి. మరి ముందు ముందు బోలో శంకర్ టీం ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news