వీధి కుక్కల కట్టడిపై సర్కార్‌ అలర్ట్… 13 మార్గదర్శకాలు విడుదల

-

హైదరాబాద్​లో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్​తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఇక తాజాగా వీటి నియంత్రణ కి మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. 13 పాయింట్స్ తో మార్గదర్శకాలు జారీ చేసింది మునిసిపల్ శాఖ.

మార్గదర్శకాలు

1.కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం…

2.కుక్కలు ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ…

3. సిటిజన్స్ ghmc పరిధి లో హెల్ప్ లైన్ నెంబర్ 04021111111…

4.మాసం దుఖణలు హోటల్స్ వారు వ్యర్థలను రోడ్స్ పై వేయకుండా ghmc వాహనాలకు మాత్రమె ఇవ్వాలి…

5.కుక్కల స్థితి ని ghmc ,స్వచ్ఛంద సంస్థలతో ప్రజలకు అవగాహన కల్పించాలి….

6.స్కూల్స్ లో విద్యార్థులు విధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలని వివరించాలి….

7.కాలనీ సంఘాలు,బస్తి లలో వచ్చే నెల రోజులు కుక్క కాటు పై అవగహన కల్పించాలి….

8.Ghmc పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బంది తో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి….

9.కాలనిలే కాకుండా ,మూసి పరిసర ప్రాంతాల్లో,చెట్లు ఎక్కువ ప్రాంతాల్లో ని కుక్కలను సైతం ఆపరేషన్ వేయడం,రేబిస్ టీకా వేయడం చేయాలి…

10.విధి కుక్కల దత్తత తీసుకోవడం పై అవగహన….

11.కుక్క కాటు కు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించడం.

12. విధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్,పోస్టర్స్, బిల్ బోర్డ్స్ తో ప్రచారం…

13. విధి కుక్కల కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు GHMC ఉంచాలి…

Read more RELATED
Recommended to you

Latest news