తన వల్ల తానే హీరోయిన్గా ఎదగలేకపోతున్నా అంటున్న చిట్టి..!

-

జాతి రత్నాలు సినిమాతో భారీ పాపులారిటీని అందుకున్న చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చినవారు ఎప్పుడు ఎవరు ఏ రేంజ్ కు వెళ్తారో చెప్పడం చాలా కష్టం. ఈ క్రమంలోనే ఇప్పుడు మంచి పాపులారిటీని దక్కించుకున్న ఫరియా క కూడా ఇబ్బందులు పడుతుందని తెలుస్తోంది .ఇటీవల ఈమె నవీన్ పోలిశెట్టి హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం జాతి రత్నాలు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ముఖ్యంగా ఈ సినిమాలో ఈమె హైట్ చూసి ప్రభాస్ కంటే హైట్ ఉందంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ఈమె పక్కన నటించాలంటే హీరోలకు ప్రభాస్ అంత హైటు ఉండాలి తప్ప చిన్న చిన్న హీరోలు ఈమె ముందు సెట్ అవరు అని అందరూ కూడా అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ ని ముంబైలో ప్రభాస్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శితోపాటు ప్రభాస్ దగ్గరికి ఫరియా కూడా వెళ్ళింది. ఆ టైంలో ఫరియాని చూసిన ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయ్యి..” ఈమె ఏంటి ఇంత పొడుగు ఉంది. నిజమేనా? లేక హై హీల్స్ ఏమైనా వేసుకుందా?” అంటూ ఆమె కాళ్ళ వైపు కూడా చూశారట. ఆ తర్వాత ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కానీ ఈమెకు మాత్రం అవకాశాలు రాలేదని చెప్పాలి. బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది అయినా గుర్తింపు లభించలేదు . ఆ తర్వాత తాను హీరోయిన్గా సెకండ్ సినిమా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాను విడుదల చేశారు. ఇది కూడా విజయాన్ని అందించలేదు

ఇప్పుడు రావణాసురలో కూడా నటిస్తోంది నిజానికి ఈమె హైట్ 5.6 ఇంచ్.. ఈమె పక్కన నటించాలంటే యంగ్ హీరోలు హైట్ తక్కువగా కనిపించే ప్రమాదం ఉందని ఫీల్ అవుతున్నారు. అందుకే ఈమెకు అవకాశాలు రావడం లేదని కూడా తెలుస్తోంది. మొత్తానికైతే తన హైట్ వల్లే తనకు అవకాశాలు రావడంలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news