భారత్‌కు బ్రిటన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియా సంతతికి చెందిన రిషి… బ్రిటన్ ప్రధాని కాగానే.. శుభవార్త అందింది. భారత్ లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. డిగ్రీ పూర్తి చేసిన భారతీయులు యూకే వచ్చే రెండేళ్లు ఉండేందుకు ఈ వీసా ద్వారా అనుమతిస్తారు.