తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. అలాగే, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా నిలిపారు. అయితే, ఈ నేపథ్యంలోనే, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది.
సీఎం కేసీఆర్ కు అఖిల భారత రైతుసంఘం ‘చోటూ రామ్’ అవార్డును ప్రకటించింది. కేసీఆర్ తరఫున మంత్రి నిరంజన్ రెడ్డి దాన్ని స్వీకరించారు. స్వామినాథన్, చోటురామ్ తర్వాత రైతులకు మేలు చేస్తోందని కేసిఆర్ఏ అని రైతు నేతలు అన్నారు. పంజాబ్ రైతులు ఆరాధించే వ్యక్తుల్లో చోటురామ్ ఒకరు. 1930లో ఆయన పంజాబ్ రైతు రుణ విముక్తి చట్టం, రుణదాతల రక్షణ చట్టం తేవడానికి ఎంతో కృషి చేశారు. దీనివల్ల అక్కడి రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.