క్రిస్ గేల్‌కు ఐపీఎల్ జరిమానా విధించింది. బ్యాటు నేలకేసి కొట్టినందుకు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ గేల్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు ముంగిట అవుటయ్యాడు.
జోఫ్రా అర్చర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన గేల్ బౌల్డయ్యాడు. శతకం ఖాయమనుకున్న వేళ అవుట్‌ను ఊహించని గేల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. బ్యాట్‌ను బలంగా నేలకేసి బాదాడు. అది కాస్తా జారి అల్లంత దూరాన పడింది. ఆ తర్వాత తనను ఔట్ చేసిన అర్చర్‌ను మెచ్చుకుంటూ గేల్ మైదానాన్ని వీడాడు. అయితే బ్యాట్‌ను విసిరికొట్టడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఐపీఎల్ అతడిపై చర్యలు తీసుకుంది.