పార్టీ అధినేత చెప్పిన ఈ ఇద్దరు మారరా..కరణం vs ఆమంచి…!

-

ప్రకాశం జిల్లా రాజకీయం వేడెక్కింది. చిరకాల ప్రత్యర్థులు ఆమంచి, కరణం బలరామ్‌ మరోసారి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారారు. ఒక దశలో ఇరు వర్గాలు కర్ర, రాళ్లలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. కరణం వర్గీయులే గొడవంతటికి కారణమని ఆమంచి ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పుట్టిన రోజు సందర్భంగా ఆయన వర్గీయులు బైక్‌ ర్యాలీ చేపట్టారు . ఆమంచి కృష్ణ మోహన్‌ ఇంటి వద్దకు రాగానే ఇరు వర్గాలు నినాదాలు చేపట్టాయ్‌. దీంతో ఆమంచి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఒకదశలో ఆమంచి, కరణం వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇద్దరి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. స్పాట్

ఆమంచి వర్గీయులను అడ్డుకున్నారు పోలీసులు. దాంతో బైక్ ర్యాలీతో కరణం బలరామ్ వర్గీయులు వెళ్లిపోయారు. అయితే కరణం మనుషులే తన ఇంటిపై రాళ్లు వేశారని, పోలీసులతో ఆమంచి కృష్ణ మోహన్‌ వాగ్వాదానికి దిగారు.కరణం మనుషలు రెచ్చగోట్టే పద్దతుల వల్లే గొడవ జరిగిందని ఆమంచి మండిపడ్డారు. తనని ఎదుర్కొనే దమ్ము లేక గొడవలకు పాల్పడ్డారని విమర్శించారు.

కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు.అప్పటి నుంచి చీరాల నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచిగా మారిపోయింది. ఇప్పటికే ఈ రెండు వర్గాలు పలుమార్లు దాడులకు దిగాయి. ఈ పంచాయితీ సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లింది. అయినా సరే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. పలుమార్లు పార్టీ అధినేత సీఎం జగన్ చెప్పినా వీరిలో మార్పురాలేదు. ఇప్పటికే ఈ ఘర్షణ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news