గత 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హై కోర్ట్ ఈ రోజు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఈ బెయిల్ మీద సిఐడి కొన్ని నిబంధనలతో కూడిన ఒక మెమోను దాఖలు చేసింది. ఈ మెమోలో చూస్తే, చంద్రబాబు రాజకీయ ర్యాలీలు చేయకూడదని, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఉండాలని తెలిపింది. ఇంకా ఎల్లప్పుడూ ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులు చంద్రబాబు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నివేదికను కోర్టుకు ఇవ్వాలంటూ మెమోలో పేర్కొంది. ఎందుకంటే ఈ బెయిల్ ను కేవలం చంద్రబాబు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మంజూరు చేసిన బెయిల్ అని తెలిసిందే.
అయితే హై కోర్ట్ ఈ విషయంలో ఇంకా విచారణ చేయలేదు. మరి వీటిని కనుక అనుమతిస్తే ఇక చంద్రబాబుకు బెయిల్ వచ్చినా రాకపోయినా ఒకటే అవుతుంది. ఇక చంద్రబాబు బెయిల్ తో బయటకు రావడంతో టీడీపీలో సరికొత్త జోష్ వచ్చింది.