సినిమా థియేట‌ర్స్ ఓపెన్ ఎప్పుడంటే..?

-

కరోనా వైరస్ ప్రభావం ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలను గజగజా వణికిస్తోంది…ముఖ్యంగా సినిమా రంగంపైనా కరోనా వైరస్ ప్రభావం మరీ ఎక్కువ పడింది… అయితే కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపులు చేస్తూ వస్తుంది కాని సినిమా థియేటర్లను మాత్రం ఈ నెలాకరు వరకు బంద్ చేయాలని నిర్ణయించింది…ఈ విషయంపై కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే విషయమై జూన్ తర్వాత మాత్రమే ఆలోచిస్తామన్నారు.

ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యను, పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. సినిమా రంగంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా థియేటర్లను తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల తర్వాత ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news