ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలతో పాటుగా రౌడీ యుజంలోను విజయవాడకు పేరు ఉంది. కాల క్రమేనా ఆ పేరు పోయింది గాని కొన్ని కొన్ని మాత్రం బెజవాడ ను ఇంకా వదిలిపోయే పరిస్థితి అయితే కనపడటం లేదు. సాధారణంగా అక్కడ ఉండే యువకులకు ఆవేశం ఎక్కువగా ఉంటుంది. మరి అక్కడ పరిస్తితులా లేక వారిని ఎవరు అయినా ఆ విధంగా మారుస్తారా అనేది తెలియదు గాని స్వతహాగా ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో గ్యాంగ్ వార్ అనేది జరిగింది.
ఈ గ్యాంగ్ వార్ లో పాల్గొన్న వ్యక్తులు కొందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇక వీరి మీద ప్రత్యేక నిఘా పెట్టారు అధికారులు. వీరికి ఉన్న సంబంధాలతో పాటుగా వీరికి ఉన్న రాజకీయ సంబంధాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసారు. రాజకీయంగా వారికి ఎవరు సహకరించి ఉంటారు, అసలు విజయవాడలో గ్యాంగ్ వార్ జరిగే విధంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ గ్యాంగ్ వార్ కి ఆర్ధికంగా సహకరించిన వ్యక్తులు ఎవరు అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇక ఈ గ్యాంగ్ వార్ లో రెండు గ్యాంగ్ ల నుంచి 25 మంది వరకు పాల్గొన్నారు. వీరిలో కాలేజి విద్యార్ధులు కూడా ఉన్నారు. దాడిలో మరణించిన తోట సందీప్ ని హత్య చేసింది కేటిఎం పండు అనే పేరు బయటకు వచ్చింది. వీరు ఇద్దరూ కూడా ఈ గ్యాంగ్ వార్ లో కీలకం అయ్యారు అని పోలీసులు చెప్తున్నారు. డీజీపీ గౌతం సవాంగ్ ని సిఎం జగన్ వివరాలు అన్నీ కూడా అడిగి తెలుసుకుని, రాజకీయ నాయకుల హస్తం ఉన్నా సరే వదిలిపెట్టవద్దు అని చెప్పినట్టు సమాచారం. ఇక అందరి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలని చెప్పారట.