చూడటానికి భయంకరంగా ఉంది కదా? ఇటువంటి జీవిని ఎప్పుడైనా చూశారా మీరు. చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసింది గోరంత. మనకు తెలియనిది కొండంత. ఎన్నో జీవులు ఈ భూమ్మీద ఉన్నప్పటికీ.. వాటిలో మనకు తెలిసింది ఎన్ని. కొన్ని మాత్రమే. అందుకే మానవులకు తెలియని జీవులను సైంటిస్టులు కనిపెడుతున్నారు. అలా వెతుకుతుంటే కంటపడిందే అక్వాటిక్ సాలమండర్.
ఉభయచర జీవుల్లో ఇటవంటి దాన్నే ఇంతవరకు చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నరు. దాదాపు రెండు అడుగుల పొడవు ఉంటుందట ఈ జీవి. దీనికి సంబంధించిన ఫోటోలను సైంటిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. దాదాపు 10 ఏళ్ల నుంచి జీవులపై చేస్తున్న అధ్యయనంలో ఈ జీవి గురించి తెలిసిందని సైంటిస్టులు చెబుతున్నారు.