బాల్య వివాహం, బహుభార్యత్వానికి నో చెబితేనే పౌరసత్వం : అస్సాం సీఎం

-

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు కొన్ని షరతులు పాటించాలని పేర్కొంది. అసోం ప్రభుత్వం. బెంగాలీ మాట్లాడే ‘మియా ముస్లింలు’ స్థానికులుగా గుర్తింపు పొందాలంటే కొన్ని రూల్స్ పాటించాలని కోరారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఈ నెల మొదట్లో సీఏఏ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హిమంత ఈ కామెంట్స్ చేశారు. అసోంలో మియా కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే ఆ సమాజంలోని వారు కొన్ని నిబంధలు పాటించాలన్నారు. ఇద్దరు పిల్లల్లే కనాలని సూచించారు. బహుభార్యత్వాన్ని నిలిపేయాలని స్పష్టం చేశారు. బాల్యవివాహాలు నిరోధించాలని మియా ముస్లింలకు తెలిపారు.

బెంగాలీ మాట్లాడే ముస్లింలు స్థానికులా, కాదా అనేది వేరే విషయమని అన్నారు. మియా ముస్లింలు ఇక్కడి నిబంధలు పాటిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బాల్యవివాహాలు, బహుభార్యాత్వాన్ని వదులుకోవాలని నొక్కిచెప్పారు. మహిళల విద్యను ప్రోత్సహించాలని కోరారు. అస్సామీ సాంస్కృతిక విలువను గౌరవించాల్సిన ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మరోవైపు కొన్ని సమూహాలు ‘సత్రాల’ భూములను ఆక్రమించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. వైష్ణమ మఠాల భూమిని ఎలా ఆక్రమించుకుని ఉండాలని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. మియాలు మదర్సాలకు దూరంగా ఉండాలని, వారు మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news