హైదరాబాద్ కు సీజేఐ.. ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

-

ఆంధ్ర ప్రదేశ్ పర్యటనను ముగించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కాసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. సిజెఐగా అయిన తర్వాత హైదరాబాద్ కు ఎన్.వి.రమణ రావడం ఇదే తొలిసారి. ఇక సిజెఐ ఎన్.వి.రమణకు తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిజెఐ ఎన్.వి.రమణకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ,తలసాని శ్రీనివాస్, పువ్వాడ అజయ్, సబిత, ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్వాగతం పలికారు. తెలంగాణకు వచ్చిన ఎన్వి రమణ రాజ్ భవన్ కు బసచేయనున్నారు. అటు రాజ్ భవన్ లో ఎన్వి రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతం పలకనున్నారు.

కాగా ఇవాళ ఉదయం శ్రీవారిని  ఎన్ వి రమణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎన్ వి రమణకు 21 పేజిల విజ్ఞప్తి లేఖను టిటిడి బోర్డు సభ్యుడు శివకుమార్ అందజేశారు. సుప్రింకోర్టు సుమోటోగా తీసుకోని…. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లేఖలో శివకుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలోనే టిటిడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా బోర్డు సభ్యుడు శివకుమార్ ప్రస్తావించారు. తెలుగు వ్యక్తిగా తమ డిమాండ్ ను నెరవేర్చాలని కూడా లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news