పాలకులు పెద్దలను గౌరవించాలి… సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు…!

పుట్టపర్తి సాయిబాబా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో సిజెఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ….సంచలన వ్యాఖ్యలు…….పాలకులు రాజధర్మం పాటించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు….ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలనే పాలకులు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. రామాయణ మహాభారతాల్లో పాలకులకు చక్కటి సందేశాలున్నాయి ఉన్నాయని చెప్పారు. పాలకులు అవలక్షణాలకు దూరంగా ఉండాలి…పాలకులు పెద్దల్ని గౌరవించాలని వ్యాఖ్యానించారు.

బలహీనులైన ప్రజలకు రక్షణ కల్పించాలని ఎన్వీ రమణ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని చెప్పారు. సీజేఐ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యం లోనే ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.