సహజంగా చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్ గుర్తించకుండానే సంతకం చేస్తారనే ఆశతో సెలవు దరఖాస్తులపై వింత మరియు నమ్మదగని కారణాలను రాస్తారు. అనేక సందర్భాల్లో, పాఠశాల అధికారులు పూర్తి అజ్ఞానం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇటువంటి విద్యార్థులు తమ దరఖాస్తులను మంజూరు చేస్తారు. ఈ క్రమంలోనే కాన్పూర్ నుండి 8వ తరగతి విద్యార్థి ఇటీవల రాసిన సెలవు పత్రం ఉపాధ్యాయుల అజ్ణానాన్ని రుజువు చేసింది.
ఆ విద్యార్థి లేఖలో తన మరణాన్ని పేర్కొంటూ పాఠశాల నుండి సగం రోజుల సెలవు కోరగా ఉపాధ్యాయుడు ఆమోదించారు. ఆ సెలవు చీటీలో ‘‘ అయ్యా! నేను ఈ రోజు ఉదయం అనగా ఆగస్టు 20, 2019 10గంటలకు చనిపోయాను. కావునా, నేను తొందరగా ఇంటికి వెళ్లాలి. ఇందుకోసం అర్థరోజు సెలవు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని రాశాడు. దీంతో ఉపాధ్యాయుడు సెలవు ఖరారు చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రిన్సిపాల్ యొక్క అజ్ఞానంపై నెటిజన్లు షాక్ వ్యక్తం చేశారు.
ఒక పాఠశాల సిబ్బంది సోషల్ మీడియాలో దరఖాస్తును లీక్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తద్వారా ఈ వ్యాఖ్యల గందరగోళానికి దారితీసింది. ఈ సంఘటన హాస్యాస్పదంగా ఉందని కొందరు, మరికొందరు ప్రిన్సిపాల్ యొక్క బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అతనిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ.. ఈ విషయంపై ప్రిన్సిపాల్ మరియు ఇతర సభ్యులు ఇంకా వ్యాఖ్యానించకపోవడం గమనార్హం