ఫిబ్రవరి 1 నుంచి ప్రాధమిక పాఠశాలలు ఓపెన్ కానున్నాయి. 1 నుంచి 5 తరగతుల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ చేయాలని ఆదేశించింది. తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
గదులు సరిపడని చోట రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. తల్లిదండ్రులు లిఖితపూర్వక హామీతోనే పాఠశాలలలో విద్యార్థులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే ఆరు పైన అన్ని తరగతుల వారికి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారు స్కూల్స్ కి హాజరు అవుతున్నారు.