- ఆయన ఎస్ఈసీ పదవికి అనర్హుడు
- టీడీపీ మేనిఫెస్టోపై ఎందుకు చర్యలు తీసుకోరు
- నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి
అమరావతి : ఆంధ్రప్రదేవ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అధికార పార్టీ వైకాపా నేతల విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా వైకాపా సీనీయర్ నేత, పార్లమెట్ సభ్యులు విజయ సాయి రెడ్డి నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ.. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ… కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ.. ఒకరికి పక్షం వహిస్తూ కొమ్ముకాస్తున్నారనీ, ఎస్ఈసీ పదవికి అనర్హుడంటూ నిప్పులు చెరిగాడు.
ఇదివరకు కరోనా పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఎన్నికలను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం ముగియనప్పటికీ ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ ఎందుకు తొందర పడుతున్నారని ఆయన విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థలో ఉన్న వ్యక్తి చంద్రబాబుతో లాలూచీ పడి నేడు ఇలా నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీపై ఏం చర్యలు తీసుకుంటారు? ఆ పార్టీ గుర్తింపు రద్దు చేస్తారా? అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి విధి నిర్వహణను అడ్డుకుంటున్నారని విమర్శించారు.