దత్తపుత్రిక వ్యవహారంలో కరాటే కళ్యాణికి క్లిన్ చిట్..!!

దత్తపుత్రిక వ్యవహారంలో సీని నటి కరాటే కళ్యాణికి క్లిన్ చిట్ లభించింది. చిన్నారిని దత్తత తీసుకున్నారని ఇటీవల తనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆమెను విచారణకు రావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆమె తన తల్లి, తమ్ముడితో కలిసి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో కరాటే కళ్యాణి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నారిని తాను దత్తత తీసుకోలేదని ఆమె బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు తెలిపింది.

karate kalyani
karate kalyani

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చిన్నారిని దత్తత తీసుకోవాలంటే న్యాయపరంగా తీసుకుంటాను. చిన్నారి తల్లిదండ్రులు కూడా నాతోనే ఉంటున్నారు. రెండు రోజులుగా నాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల వల్ల నా తల్లి, తమ్ముడు మనస్థాపానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వారికి ధైర్యం చెప్పి.. విచారణకు హాజరయ్యాను.’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో కరాటే కళ్యాణికి క్లిన్ చిట్ లభించింది. అలాగే ఏ ఆధారం లేకుండా తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.