ఎమ్మెల్యే కోమటిరెడ్డితో సీఎల్పీ భట్టి భేటీ

-

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దాదాపు మూడున్నర గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. రాజగోపాల్ రెడ్డిని భట్టి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని వీడొద్దని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగానే భట్టి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.

దాదాపు మూడున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగుతోంది. తెరాసను ఓడించే శక్తి భాజపాకే ఉందని నిన్న రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అధిష్ఠానం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్‌ బలహీనపడిందని.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణలో చట్టం తనపని తాను చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉంది. దీంతో ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను తెప్పించుకొని రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఆరా తీస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఉద్యమం చేసిన వారికి కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్‌ కాంగ్రెస్‌ లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే సీరియస్ గా ఉన్న అధిష్ఠానం ఇక ఏం నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news