రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా తల్లి, చెల్లిని ఎస్ఎంఎస్ లో అసభ్యంగా దూషించినా గత ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎం పై అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది అని ప్రశ్నించారు.
కొందరికీ డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయిందన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిపారు సీఎం చంద్రబాబు. ఆ చట్టాన్ని రద్దు చేశాం. కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే.. ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తామన్నారు. వాల్లు ఇక బయట తిరగలేరని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.