ప్రతిభావంతుడైన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడికి సీఎం జగన్ ఆర్థికసాయం

-

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే అర్జీ బాలకృష్ణ… ప్రతిభావంతుడైన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు. జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించాడు. బాలకృష్ణ ఈ ఏడాది డిసెంబరులో మలేసియాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించాడు. ఇటీవల సీఎం జగన్ ను కలిసి సాయం కోరిన బాలకృష్ణ 75 కిలోల విభాగంలో పోటీపడుతున్నాడు.

CM Jagan financiallly helps to a power lifter

అయితే, మలేసియా వెళ్లేందుకు ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో, ఇటీవల సీఎం జగన్ ను సాయం కోరాడు. వెంటనే స్పందించిన సీఎం జగన్ రూ.2.50 లక్షల సాయం ప్రకటించారు. పవర్ లిఫ్టింగ్ లో బాలకృష్ణ ఘనతలను అభినందించారు. ఆ మేరకు అధికారులు అర్జీ బాలకృష్ణకు సీఎం ఆర్థిక సాయం తాలూకు చెక్ ను అందజేశారు. విదేశీ టోర్నీలో పాల్గొనేందుకు కోసం ఓ పవర్ లిఫ్టర్ కు సీఎం జగన్ ఆర్థికసాయం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news