అమరావతి : ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికులకి శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచనలు చేసింది జగన్ సర్కార్. స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోనున్న ప్రభుత్వం… తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికుల నుంచి ఆప్షన్లను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్ ను కోరామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించా రన్నారు. త్వర లోనే ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేయనుందనీ వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల.. ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.