తాజాగా రాబోయే లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఇందులో సీఎం జగన్ విద్యావంతులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించారు.వైసీపీ ప్రకటించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు ఈ అసెంబ్లీ ఎన్నికల లో పోటీ చేయనున్నారు.
19 మంది మహిళలకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే… సీఎం జగన్ పులివెందుల నుంచి తిరిగి బరిలోకి దిగుతున్నారు.కాగా, ఇటీవలి తొలి జాబితాను పొత్తులో భాగంగా టీడీపీ , జనసేన, బీజేపి ప్రకటించిన సంగతి తెలిసిందే.