ఏపీ ఉద్యోగులకు జగన్‌ శుభవార్త.. దీపావళి మరుసటి రోజు హాలీడే

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ తీపి కబురు చెప్పింది. దీపావళీ మర్నాడు ఏపీ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ… సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళీ మర్నాడు ఆరో తేదీన ఆప్షనల్ హలీడేగా ప్రకటించారు సీఎం జగన్‌. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

jagan
jagan

ఇక అంతకు ముందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభా కాంక్షలు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు సీఎం జగన్‌.