పండుగపూట తెలంగాణలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో పండగపూట విషాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చెట్టును ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందారు. తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామ శివారు లో చెట్టును ఢీకొన్న ముగ్గురు వ్యక్తులు అక్కి డిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్పుడు కారు లో ఎనిమిది మంది ప్రయాణిస్తుండ గా…. ముగ్గురు మాత్రం మృతి చెందారు.

మృతుల్లో శుశాంక్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు ఉండటం విచారకరం. ఈ ప్రమాదంలో చిన్నారులు యశ్వంత్, శ్రీ హర్ష తీవ్రంగా గాయపడ్డారు. రేపు దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో కామారెడ్డి లో టపాకాయలు కొనుగోలు కోసం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. డ్రైవర్‌ తప్పిదం కారణంగానే ఈ యాక్సిడెంట్‌ జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.