ఆక్వా ధరల పతనం, ఫీడ్ ధరల పెంపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సిండికేట్ గా మారి రైతులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, సి.ఎస్, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.
వారం రోజులలో నివేదిక అందించాలని సూచించారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చిన సిండికేట్ గా మారి రైతులను నష్టపరచడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.