అనారోగ్యం కారణంగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఉషారాణి

-

అనారోగ్యం కారణంగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు మావోయిస్టు ఉషారాణి అలియాస్ విజయక్క అలియాస్ పోచక్క. ఈ సందర్భంగా ఆమెను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు డిజిపి మహేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 31 సంవత్సరాలుగా ఉషారాణి అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు.

ఉషారాణి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి. ఉషారాణి తండ్రి భుజంగరావు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడని.. అతను గతంలో విరసంలో పనిచేశాడని తెలిపారు. ” విరసం సభలో చాలామందితో పరిచయం ఏర్పడింది. తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని దండకారణ్యంలో జాయిన్ అయ్యాడు. డెన్ కీపర్ గా పనిచేశాడు. తల్లి లలితమ్మ కూడా తండ్రి భుజంగరావుతో కలిసి అజ్ఞాతంలో ఉన్నారు. కుటుంబంలో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్ వార్ పట్ల ప్రభావితమైన ఉషారాణి అజ్ఞాతంలోకి వెళ్ళింది. విద్యాభ్యాసంలోనే పీపుల్స్ అనుబంధ గ్రూప్స్ లోో పనిచేసింది.

తన భర్త పీపుల్స్ వార్ లో పనిచేయడంతో ఆమె కూడా దలంలో జాయిన్ అయిందిి. 1991లో దళంలో జాయిన్ అయింది. 1998లో భర్త వెంకటేశ్వర్ చనిపోయాడు. ఉషారాణి రాచకొండ దళ కమాండర్ గా పనిచేసింది. 2002 నుండి 2011 ప్లేటున్ కమాండర్ గా పనిచేసింది. 2011 మొబైల్ పొలిటికల్ టీచర్ గా పనిచేసింది. 2019లో ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని లొంగిపోతానని పార్టీకి అభ్యర్థించింది. ఐదు ఎటాక్ కేసుల్లో, మూడు బ్లాస్టింగ్ కేసులు, రెండు అసాల్ట్ కేసులు, మూడు ఎక్సైజ్ ఫైర్ కేసులు ఉషారాణిపై ఉన్నాయి” అని తెలిపారు డిజిపి మహేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news