కర్ఫ్యూ ఆంక్షలపై జగన్ బిగ్ ట్విస్ట్… మరో గంట పెంపు

అమరావతి : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ పై సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. కోవిడ్, వ్యాక్సినేషన్ తాజా పరిస్థితి పై ఈ సందర్భంగా సమీక్ష చేపట్టారు సీఎం జగన్. అయితే.. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూ ఆంక్షల సడలింపు మరో గంటకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్‌.

ఇక నిర్ణయం ప్రకారం… ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఉండనున్నాయిన సీఎం జగన్‌ పేర్కొన్నారు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే… ముందస్తుగా అనుమతి తీసుకోవాలని… పెళ్లిళ్ల లో 150 మందికే అనుమతి ఉందని గుర్తు చేశారు సీఎం జగన్‌. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.