విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీలు : ఐటీ పాలసీపై సీఎం జగన్

-

అమరావతి : ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్స్, డిజిటల్‌ లైబ్రరీలపై ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. యువతకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశం కావాలని… హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించాలన్నారు. హైఎండ్‌ స్కిల్స్‌ నేర్పించే కంపెనీలకు, సంస్థలకు పాలసీలో ప్రాధాన్యత, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. విశాఖపట్నం ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుందని..ప్రభుత్వం కల్పించనున్న మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇవన్నీ కూడా నగర స్థాయిని మరింత పెంచుతాయన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్‌ సిటీలు ఏర్పాటు చేయాలని.. దీనికి అవసరమైన భూములను గుర్తించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.


కాన్సెప్ట్‌సిటీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుందని… ఐటీ రంగంలో అత్యుత్తమ యూనివర్శిటీని విశాఖపట్నంలో తీసుకురావాలని పేర్కొన్నారు. ఐటీ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ లెర్నింగ్‌కు డెస్టినేషన్‌గా ఈ యూనివర్శిటీ మారాలన్నారు. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటివ్‌లు ఉంటాయని… కనీసం ఏడాది పాటు ఒక ఉద్యోగి స్థిరంగా అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. మొదటి ఏడాది పూర్తవగానే ఆ కంపెనీకి ఇన్సెంటివ్‌ల చెల్లింపులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ నిబంధన వల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుందని… నిర్ణీత కాలం పని వల్ల నైపుణ్యం కూడా మెరుగుపడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news