టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తా : సీఎం జగన్‌

-

ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశనం చేశారు. ఆయన మంగళవారం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టిక్కెట్ విషయంలో అందరూ తన నిర్ణయాన్ని గౌరవించాలని, టిక్కెట్ రాని వారికి మరో పదవి ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన తన మనిషి కాకుండా పోరని నేతలకు చెప్పారని సమాచారం. 175 సీట్లకు 175 సీట్లు గెలవడం అసాధ్యమేమీ కాదని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

TDP leaders are acting like Street Rowdies in the Assembly: CM YS Jagan  Mohan Reddy

ఇక నుండి మనం గేర్ మార్చాల్సి ఉందని సీఎం వైఎస్ జగన్ ప్రజా ప్రతినిధులకు చెప్పారు. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సర్వే తుది దశకు వచ్చిందని జగన్ పార్టీ నేతలకు చెప్పారు. సర్వే ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఇప్పటివరకు మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు… ఇకపై చేసే కార్యక్రమాలు మరో ఎత్తు అని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు సాధించడం సాధ్యమేనని జగన్ అభిప్రాయపడ్డారు.ఒంటరిగా పోటీకి విపక్షాలు వెనుకాడుతున్నాయన్నారు. అందుకే పొత్తులు పెట్టుకొని పోటీ చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయని జగన్ చెప్పారు. మన పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలని సీఎం జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులను కోరారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయంతో పని చేసుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు సూచించారు.మనమంతా ఒకే కుటుంబసభ్యులమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news