ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఒకవైపు టీడీపీ, జనసేనలు మరోవైపు బీజేపీలు వైసీపీని ఎలాగైనా ఓడించడానికి పన్నాగాలను పన్నుతున్నారు. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అందరితో టచ్ లో ఉంటూ ఎందుకు మనము ఈ ఎన్నికలలో గెలవాల్సిన అవసరం ఉంది అంటూ వివరించి చెబుతున్నారు. తాజాగా వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ లతో మీటింగ్ ను ఏర్పాటు చేసుకుని వారికి చాలా కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి బస్సు యాత్రను స్టార్ట్ చెయ్యాలని.. ప్రతి నియోజకవర్గంలోనూ ఖచ్చితంగా యాత్రను స్టార్ట్ చేయాలంటూ సీఎం జగన్ అందరికీ గట్టిగా చెప్పారు. మనకు మిగిలి ఉన్న ఈ కొద్ది సమయాన్ని అందరూ తప్పకుండా ఉపయోగించుకోవాలంటూ వివరించి క్లారిటీగా చెప్పారు సీఎం జగన్.
మరి ఈ యాత్రను సక్రమంగా జరిపించి వైసీపీని రీజినల్ కో ఆర్డినేటర్ లు గెలిపించుకుంటారా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే.