ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లోనే పీఆర్సీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీపి కబురు చెప్పారు. పీఆర్సీ  పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు.. పది రోజుల్లోనే దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ తిరుపతి లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతి సరస్వతీనగర్ లో ఉద్యోగులు సీఎం వైయస్ జగన్ ను కలిసి పీఆర్సీ పై విజ్ఞప్తి చేశారు.

పి ఆర్ సి ప్రకటన చేయాలని ఉద్యోగులు ఈ సందర్భంగా సీఎం జగన్ ను కోరారు. అయితే అభ్యర్థనపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే  పూర్తి అయిందని వారికి చెప్పారు సీఎం వైయస్ జగన్.  మరో పది రోజుల్లో పీఆర్సీ అనౌన్స్ చేస్తామని ప్రకటన చేశారు సీఎం వైయస్ జగన్.  దీనిపై ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని హామీ ఇచ్చారు సిఎం జగన్. సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news