ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..

-

నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారని… వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే.. నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని.. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామన్నారు.

సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించడంలో రాణించిన ఉపాధ్యాయులకు మంచి భవిష్యత్తు ఉండే చర్యలు తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలి.

దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలని.. లెర్నింగ్‌ టు లెర్న్‌ కాన్పెప్ట్‌లోకి తీసుకెళ్లాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని.. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. స్కూళ్లలో నాడు – నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి.. లేకపోతే నిరర్ధకమవుతాయని… మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు–నేడు రెండో విడత మొదలు పెట్టాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news