రేపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో సీఎంసీ హాస్పిటల్ మరియు అమూల్ డైరీ ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి రానున్నాడు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. మా జిల్లాలో వీటిని అత్యవసర పరిస్థితుల్లో నిర్మించడానికి తలపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. జగన్ చెబుతున్న ప్రకారం ఎన్నికలకు ముందే ఈ డైరీని ప్రారంభిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వాస్తవంగా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు చెరకు సాగు ఎక్కువగా లేదని నిరాశను తెలిపారు. కాగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్న ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ను వచ్చే సీజన్ కు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇప్పుడు నిర్మించనున్న అమూల్ డైరీ వలన రైతులకు ధరలు పెరిగాయన్నారు, ఇప్పుడు అన్ని డైరీ లు కూడా ఎక్కువ ధరలు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు మంత్రి. సీఎంసీ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ అమలు గురించి కూడా సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు పెద్దిరెడ్డి.