అమరావతి: పంచాయతీరాజ్ కమిషనరేట్ ను ముట్టడించిన సర్పంచ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు !

-

ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు అందరూ కలిసి తమ డిమాండ్ లను నెరవేర్చాలని అమరావతి లోని పంచాయితీ రాజ్ కమిషనరేట్ ను ముట్టడించారు. దీనితో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతకు మారాయి, ఈ సంఘటనతో అప్రమత్తం అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడకు చేరుకున్న సర్పంచులను వరిసాగు వ్యానులలో అరెస్ట్ లు చేసి స్టేషన్ కు తరలించారు. సర్పంచుల సంఘం నేతలు మా డిమాండ్ లను నెరవేర్చే వరకు ఈ ముట్టడి జరుగుతూ ఉంటుందంటూ తమ గొంతును వినిపించారు. అయితే వీరు అడుగుతున్న ప్రకారం…15 వ ఆర్ధిక సంఘం నిధులు విడుదలయ్యి నెలన్నర కావస్తున్నా ఇంకా ఎందుకు మాకు ఇవ్వలేఅంటూ అడిగారు. గ్రామాల అభివృద్ధికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉదని బాధపడ్డారు. కొన్ని నెలలుగా గ్రీన్ అంబాసిడర్ లకు జీతాలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.

సర్పంచులకు ఇప్పటికి ఇస్తున్న జీతం రూ. 3000 నుండి రూ. 15000 లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక చిన్న చిన్న పంచాయితీలలో కరెంట్ బిల్లులు, తాగునీటి సరఫరా, వీధిలైట్లు పార్టీ బాధ్యత ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news