CM JAGAN: స్కూల్స్ విషయంలో జగన్ మార్క్ నిర్ణయం

-

ఆంధ్రప్రదేశ్ లో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తన మార్క్ పాలనను కొనసాగిస్తూ ఎవ్వరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం అదే విధంగా ఉందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ కు ఎక్కువగా ఉన్న విషయం సీఎం దృష్టికి రావడంతో దీనిపై బాగా అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఎందుకు పిల్లలు స్కూల్స్ కు వెళ్లకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు, వీరిని మళ్ళీ తిరిగి స్కూల్స్ లో జాయిన్ అయ్యేలా ఒక స్టూడెంట్ కౌన్సిలర్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధానంలో స్కూల్స్ అంటే భయపడే విద్యార్థులను ఈ కౌన్సిలర్లు మాట్లాడి వారిలో స్కూల్ అంటే భయం పోయేలా ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తారు.

అంతే కాకుండా వీరు తల్లితండ్రులతో సైతం మాట్లాడి వారి పిల్లలను స్కూల్స్ కు పంపేలా వారిని ప్రోత్సహిస్తారు. ఈ కౌన్సిలర్లు మండలాల వారీగా ఉంటూ డ్రాప్ ఔట్స్ ను తగ్గించడానికి అమలు లోకి తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news